- Advertisement -
న్యూఢిల్లీ : ప్రముఖ వాణిజ్య వాహనాల తయారీదారు ఐషర్ ట్రక్స్ అండ్ బసెస్ కొత్తగా లాజిస్టిక్ రంగం కోసం ఐషర్‌ప్రో ఎక్స్ డీజిల్‌ను విడుదల చేసినట్లు ప్రకటించింది. ఈ కొత్త వాహనాలను ప్రత్యేకంగా ఇ-కామర్స్, ఎఫ్‌ఎంసిజి, కోల్డ్ చైన్, పండ్లు, కూరగాయలు , పార్శిల్, కొరియర్ విభాగాల కోసం రూపొందించబడిందని తెలిపింది. కొత్త ఐషర్ ఇ449 ఇంజిన్‌తో లభిస్తుందని విఇ కమర్షియల్ వెహికల్స్ లిమిటెడ్ ఎండి అండ్ సిఇఒ వినోద్ అగర్వాల్ తెలిపారు. ఐషర్ ప్రో ఎక్స్ డీజిల్ విడుదలతో భారతదేశంలో చివరి మైలు లాజిస్టిక్స్‌ను మార్చడంలో తాము మరో ముఖ్యమైన అడుగు వేస్తున్నామన్నారు.
- Advertisement -



