Wednesday, January 14, 2026
E-PAPER
Homeతాజా వార్తలుతెలంగాణలో ఎనిమిది మంది ఐపీఎస్ లు బదిలీ

తెలంగాణలో ఎనిమిది మంది ఐపీఎస్ లు బదిలీ

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణ పోలీసు శాఖలో పరిపాలన సౌలభ్యం, సమర్థవంతమైన పోలీసింగ్‌ను బలోపేతం చేసే లక్ష్యంతో ఎనిమిది మంది సీనియర్ అధికారులను బదిలీ చేస్తూ హోంశాఖ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ బదిలీలలో భాగంగా కె.ప్రసాద్‌ సీఐడీ ఎస్పీగా, ఐ.పూజ కమాండ్‌ కంట్రోల్ ఎస్పీగా, ఎస్‌.రవి రాచకొండ అదనపు ఎస్పీగా, ఎస్.సూర్యనారాయణ ఏసీబీ డీజీ ఆఫీస్‌కు (అటాచ్) నియమితులయ్యారు. టి.గోవర్ధన్‌ ఎస్‌వోటీ అదనపు డీసీపీగా, జి.నరేందర్‌ ఇంటెలిజెన్స్ అదనపు ఎస్పీగా, ఎం.సుదర్శన్‌ సైబరాబాద్‌ అదనపు డీసీపీగా, కె.వెంకటలక్ష్మి హైదరాబాద్‌ సిటీ డీసీపీగా బాధ్యతలు స్వీకరించారు. పలువురు అదనపు SP ర్యాంకు అధికారులకు కూడా కొత్త బాధ్యతలు అప్పగించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -