నవతెలంగాణ – కంఠేశ్వర్
ఎనిమిదవ జాతీయ పోషణ మాసం సందర్బంగా జిల్లా స్థాయి పోషణ మాసం కార్యక్రమాన్ని మోటాటి రెడ్డి ఫంక్షన్ హాల్ గుండారం నిజామాబాద్ నందు జిల్లా సంక్షేమ అధికారి యస్ కే రసూల్ బీ అధ్యక్షతన గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధి గా గౌరవ నిజామాబాదు రూరల్ నియోజకవర్గం యం యల్ ఏ భూపతి రెడ్డి, అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీస్ అంకిత్, నిజామాబాదు అర్బన్ రూరల్ సీ డి పి వో లు సౌందర్య, జ్యోతి సూపర్ వైజర్ లు అంగన్వాడీ టీచర్ లు, గర్భవతులు, తల్లులు ఇతర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం లో పోషకాహారా వంటకాల ప్రదర్శన నిర్వహించడం జరిగింది, సామూహిక శ్రీమంతాలు, అక్షరాబ్యాసం వంటలలో గెలుపొందిన వారికి బహుమతుల ప్రధానం యం యల్ ఏ చేతుల మీదుగా నిర్వహించారు.
ఎనిమిదవ జాతీయ పోషణ మాసం కార్యక్రమం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES