మణుగూరు ఓసి ప్రాజెక్టు అధికారి కే చంద్రశేఖర్ కు గౌరవ్ ఇన్ చార్జ్ సతీష్ కి వినతి..
నవతెలంగాణ – మణుగూరు
భూనిర్వాసిత, ప్రభావిత,స్థానికులకు గౌరవ్ ఓబీ కంపెనీలలో ఎనబై శాతానికి తగ్గకుండా ఉపాధి కల్పించాలనీ కోరుతూ శనివారం ఐ ఎఫ్ టి యు ఆధ్వర్యంలో మణుగూరు ఓసి ప్రాజెక్టు అధికారి కే చంద్రశేఖర్ కు గౌరవ్ ఓబీ కంపెనీ ఇన్ చార్జ్ సతీష్ కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా నాయకులు మాట్లాడుతూ.. మణుగూరు ఓసి ఓబి వెలిగితీత టెండర్ కాంట్రాక్ట్ పొందిన గౌరవ్ ఓబీ కంపెనీలో సింగరేణి భూ నిర్వాసిత, ప్రభావిత కుటుంబాలకు చెందిన నిరుద్యోగులకు, స్థానికులకు సింగరేణి కార్మిక కుటుంబాలకు చెందిన యువకులకు స్థానిక ఓబి కంపెనీలలో 80 శాతానికి తగ్గకుండా ఉపాధి కల్పించాలన్నది గౌరవ సింగరేణి ఎండి బలరాం ఆదేశాలు మణుగూరు ఓసి యాజమాన్యం అమలు చేయాలన్నారు.
నైపుణ్యత లేదా నైపుణ్యత లేని పనులలో అనగా డ్రైవర్లు, గ్యారేజ్ సిబ్బంది, క్యాంటీన్, ఇతరులు సింగరేణి భూ నిర్వాసితులకు, ప్రభావిత గ్రామాలకు చెందిన వారికి స్థానికులకు, సింగరేణి కార్మిక కుటుంబాలకు చెందిన నిరుద్యోగ యువకులకు ఉపాధి కల్పించేలా సింగరేణి యాజమాన్యం తగు చర్యలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాజర్ పాషా ఐ ఎఫ్ టి యు జిల్లా నాయకులు మిడిదొడ్ల నాగేశ్వరరావు, పి వై ఎల్ నాయకులు సాధన పల్లి రవి, చల్ల కాంతారావు,పెనుగొండ నాగార్జున, టి సాంబశివరావు, బి నారాయణ, జే విజయకుమార్ , కే చిట్టిబాబు, డి నరేష్,బి జయరాజు చల్లా వీరన్న, చల్లా మధుసూదన్, సత్యనారాయణ, రాజేందర్ మైపా సౌదామిని, ఎస్ కే కుమారి ,డి రత్న కుమారి, టి సావిత్రి, మైపా శంకరమ్మ తదితరులు పాల్గొన్నారు.