– జాగృతి అధ్యక్షులు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
నవతెలంగాణ-ముషీరాబాద్
ఏకలవ్య భవనాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని జాగృతి అధ్యక్షులు, ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ ఆదివాసీ ఎరుకల సంఘం, ఎరుకల ఉద్యోగుల సంఘం రాష్ట్ర కమిటీ సంయుక్త ఆధ్వర్యంలో ట్యాంక్ బండ్‌పై కొమురం భీం విగ్రహం వద్ద ఏకలవ్య జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏకలవ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఏకలవ్య కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయాలని చేవెళ్ల డిక్లరేషన్‌లో ఇచ్చిన హామీ మేరకు కార్పొరేషన్‌కి రూ. 500 కోట్ల బడ్జెట్ కేటాయించాలని డిమాండ్ చేశారు. ఎరుకల కులస్తులు ఎదుర్కొంటున్న సమస్యలను శాసనమండలిలో ప్రస్తావించి వారి సమస్యలు పరిష్కరించాలని పలుమార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని అన్నారు. బడుగు, బలహీన వర్గాలకు సామాజిక న్యాయం చేయాలని కోరారు. త్వరలోనే ఏకలవ్య భవనాన్ని పూర్తి చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఆదివాసీ ఎరుకల సంఘం రాష్ట్ర అధ్యక్షులు లోకిని రాజు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కూతాడి రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఏకలవ్య భవనాన్ని త్వరగా పూర్తి చేయాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES