నవతెలంగాణ- భువనగిరి కలెక్టరేట్
భువనగిరి జిల్లా కేంద్రంలో ఏకలవ్యుని జయంతి సందర్భంగా ఏకలవ్యుని చిత్రపటానికి తెలంగాణ ఆదివాసి ఎరుకల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు, యాదాద్రి జిల్లా అధ్యక్షులు కుతాడి సురేష్ పూలమాలలు వేసి, ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జై కుర్రు,జై జై కుర్రు,కృషి ఉంటే సాధించలేనిది అంటూ ఏదీ లేదని నిరూపించిన మహావీరుడనీ, త్యాగానికి నిలువెత్తు ప్రతిరూపమైన ఏకలవ్యుడు, ఏకలవ్య జయంతి వేడుకలో పాల్గొని వారి ధీరత్వాన్ని, త్యాగనిరతిని గుర్తు చేసుకుంటూ ఆ మహా వీరుడికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కోనేటి నరసింహ, సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు నలగొండ వీరన్న,గుండ్రాతి రవి లు పాల్గొన్నారు.
ఏకలవ్యుని జయంతి వేడుకలు…
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES