Wednesday, May 7, 2025
Homeతెలంగాణ రౌండప్పని ప్రదేశంలో వృద్దుడు మృతి..

పని ప్రదేశంలో వృద్దుడు మృతి..

- Advertisement -

నవతెలంగాణ -దుబ్బాక: పనిచేస్తుండగా బీపీ ఎక్కువై కింద పడిపోయిన ఓ వృద్ధుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన దుబ్బాక మండలం హబ్సిపూర్ గ్రామంలో జరిగింది. ఎస్ఐ వీ.గంగరాజు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన వంగ చంద్రయ్య (84) కు భార్య భారతి, చిన్న కొడుకు గంగాధర్ ఉన్నారు. పెద్దకొడుకు వెంకటస్వామి గతంలోనే చనిపోయాడు. ఇదే గ్రామానికి చెందిన ఎండీ.చాంద్ పాషా దగ్గర చంద్రయ్య కూలిగా పనిచేస్తున్నాడు. ఈనెల 4 న పనిచేస్తున్న చోటే బీపీ ఎక్కువై కింద పడిపోయిన చంద్రయ్యను యజమాని చాంద్ పాషా.. దుబ్బాకలోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి సిద్దిపేట జిల్లా ఆస్పత్రికి, అక్కడి వైద్యుల సిఫారసు మేరకు మెరుగైన వైద్య చికిత్స కోసం హైదరాబాదులోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం మధ్యాహ్నం చనిపోయాడు. మృతుని భార్య భారతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -