నవతెలంగాణ – ధర్మసాగర్
వడదెబ్బతో వృద్ధుడు మృతి చెందిన ఘటన మండల కేంద్రంలో ఆదివారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మండల కేంద్రానికి చెందిన దువ్వ రాజయ్య (68) కుటుంబ సభ్యులు ఆదివారం మధ్యాహ్నం పెద్ద పెండ్యాల ఫంక్షన్ కి వెళ్లడం జరుగుతుంది. ఇంటి వద్దనే ఉన్న రాజయ్య సాయంకాల సంధ్య వేళ కుటుంబ సభ్యులు ఇంటికి తిరిగి రాగా తీవ్ర దాహంతో ఉన్న అతనికి నీటిని ఇచ్చిన వెంటనే వడదెబ్బ తీవ్రతకు అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు. నిరుపేద కుటుంబానికి చెందిన దువ్వరాజయ్య మృతి పట్ల స్థానికులు దిబ్రాంతుకి లోనై,దీంతో నిరుపేద కుటుంబానికి చెందిన ఆయన కుటుంబాన్ని ప్రభుత్వ పరంగా ఆదుకోవాలని స్థానికులు కుటుంబ సభ్యులు బంధువులు కోరుతున్నారు.