నవతెలంగాణ – జన్నారం
పెంచిన పెన్షన్లను వెంటనే అందించాలని డిమాండ్ చేస్తూ జన్నారం మండలంలోని దివ్యాంగులు, వృద్ధులు, బీడీ కార్మికులు తహశీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు కొండుకూరి ప్రభుదాస్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. పెన్షన్లు విడుదల చేయకపోవడం వల్ల తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వారు వాపోయారు. అనంతరం మండల తాసిల్దార్ రాజ మనోహర్ రెడ్డి కి వినతి పత్రం అందించారు . కార్యక్రమంలో విహెచ్పిఎస్ నియోజకవర్గ నాయకురాలు కాలువ సుగుణ నాయకులు కొండూకురి ప్రశాంత్, రాజు జంగం రవి వేయిగండ్ల సుధాకర్ నారపాక రాజు మామిడిపల్లి మోహన్ తదితరులు పాల్గొన్నారు.
పెన్షన్ల కోసం తహశీల్దార్ కార్యాలయం ముందు వృద్దుల నిరసన
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES