నవతెలంగాణ – నాగిరెడ్డిపేట్
నాగిరెడ్డిపేట మండలంలోని జలాల్ పూర్ గ్రామానికి చెందిన గుల్ల కిష్టవ్వ (65) మనస్థాపంతో పోచారం ప్రధాన కాలువలు పడి ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై భార్గవ్ గౌడ్ తెలిపారు. సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. జలాల్పూర్ గ్రామానికి చెందిన గుళ్ళకిష్టవ్వ ఈనెల 25న తన మనుమడులకు తిట్టడం జరిగింది. ఈ విషయంపై తన కొడుకు గుల్ల నర్సింలు ఎందుకు తిట్టావని ప్రశ్నించడంతో మనస్థాపానికి గురైన గుల్లకిష్వ అదే రోజు రాత్రి ఇంటి నుండి బయటకు వెళ్లిపోయింది గత రెండు రోజుల నుండి ఇంటికి రాలేదు. గురువారం రోజు పోచారం ప్రధాన కాలువలో శవమై తెలింది. ఇంట్లో జరిగిన గొడవల కారణంగా మనస్థాపం చెంది పోచారం ప్రధాన కాలువలో పడి ఆత్మహత్య చేసుకున్నట్లు కుమారుడు గూల్ల నరసింహులు దరఖాస్తులో పేర్కొన్నట్లు ఎస్ఐ భార్గవ్ గౌడ్ తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై భార్గవ్ గౌడ్ తెలిపారు.
మనస్థాపంతో వృద్ధురాలు ఆత్మహత్య
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES