Wednesday, November 19, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పల్లెల్లో మళ్లీ ఎన్నికల సందడి.!

పల్లెల్లో మళ్లీ ఎన్నికల సందడి.!

- Advertisement -

వచ్చే నెలలో నోటిఫికేషన్.?
నవతెలంగాణ – మల్హర్ రావు

గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర మంత్రి వర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వచ్చే నెల రెండో వారంలో సర్పంచ్ ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు సిద్ధం చేయాలని పంచాయతీ, గ్రామీణాభివృద్ధి శాఖలను ఆదేశించినట్లు సమాచారం. మంత్రివర్గ నిర్ణయంతో మళ్లీ గ్రామాల్లో స్థానిక ఎన్నికల సందడి మొదలైంది.బీసీలకు 42 శాతం రిజర్వేషన్లతో స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించడంతో గత నెలలో ఎన్నికల సంఘం నోటిఫికేషన్ సైతం విడుదల చేసిన విషయం తెలిసిందే.అయితే కోర్టు తీర్పుతో ఆ ప్రక్రియ నిలిచిపోయింది.

తాజాగా 50 శాతానికి లోబడి రిజర్వేషన్లు ఖరారు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది.ప్రభుత్వం ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నట్లు డీఆర్ఆర్డీ శాఖ కోర్టుకు తెలియ జేస్తే ఎన్నికల నోటిఫికేషన్ ఎప్పుడైనా వెలువడే అవకాశం ఉంది.మండలంలో 15 గ్రామ పంచాయతీల్లో 128 వార్డులు ఉన్నాయి.22,446 మంది ఓటర్లు ఉండగా, వీరిలో 10,967 మంది పురుషులు,11,479 మంది మహిళలు ఉన్నారు.మండల వ్యాప్తంగా 46 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి.ముందుగా ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. మండల యంత్రాంగం ఆదిశగా ఏర్పాట్లకు సిద్ధమవుతోంది.ఆ తర్వాత 7 ఎంపీటీసీ,ఒక జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరిగే అవకాశం ఉంది.రిజర్వేషన్లలోనూ మార్పులు చోటు చేసుకోనున్నాయి. గత నెలలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లతో ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయగా..తాజాగా నిర్ణయంతో రిజర్వేషన్లు 50 శాతం లోబడి ఉండనున్నాయి. బీసీల రిజర్వేషన్ల శాతం 27కు తగ్గే అవకాశం ఉంది. కొత్త రిజర్వేషన్లు ఎవరికి అనుకూలిస్తాయోననే ఉత్కంఠ ఆశావహు ల్లో ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -