Friday, September 26, 2025
E-PAPER
Homeజాతీయంబీజేపీకి అనుబంధంగా ఎన్నికల సంఘం

బీజేపీకి అనుబంధంగా ఎన్నికల సంఘం

- Advertisement -

సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ ఆగ్రహం
తిరువనంతపురం :
రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన స్వతంత్ర సంస్థ అన్న విషయాన్ని విస్మరించిన కేంద్ర ఎన్నికల సంఘం బీజేపీ ప్రభుత్వానికి అనుబంధ సంఘంలా వ్యవహరి స్తోందని సీపీఐ (ఎం) ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ విమర్శించారు. తిరువనంతపురంలో ఆయన ఆదివారం విలేకరులతో మాట్లాడారు. గత లోక్‌సభ ఎన్నికల కోసం ఎన్నికల కమిషన్‌ ప్రచురించిన ఓటర్ల జాబితాలో చోటుచేసుకున్న అక్రమాలపై లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ కొన్ని ‘విస్ఫోటక ఆరోపణలు’ చేశారని చెప్పారు. బీజేపీ ప్రభుత్వం సుప్రీంకోర్టు సూచనలు పరిగణనలోకి తీసుకోకుండా తనకు విధేయులైన వారిని ఎన్నికల కమిషన్‌లో నియమించిందని, వారు ఇప్పుడు తప్పుడు పనులు చేస్తున్నారని ఆరోపించారు.
‘ఒకవైపు ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌) పేరుతో నిజమైన ఓటర్లను తొలగిస్తున్నారు. మరోవైపు ఏదైనా ఓ ప్రాంతంలో రెండు సంవత్సరాలకు పైగా కన్పించని వారిని ఓటర్లుగా చేరుస్తున్నారు’ అని బేబీ ధ్వజమెత్తారు. ఏదైనా ఒక చోట కనీసం ఆరు నెలల పాటు నివసిం చిన వారికే ఓటు హక్కు కల్పించాలని నిబంధన ఉన్నదని, అయితే దానిని ఈసీ పాటించడం లేదని విమర్శించారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు కేరళలోని త్రిస్సూర్‌ నియోజకవర్గంలో 30,000 నకిలీ ఓట్లను బీజేపీ చేర్చినట్లు తనకు సమాచారం అందిందని చెప్పారు. సమీప ప్రాంతాలకు చెందిన అనేక మందిని త్రిస్సూర్‌ లోక్‌సభ నియోజకవర్గ ఓటర్లుగా చేర్చారని, ఈ విషయాన్ని తీవ్రంగా పరిశీలించాల్సిన అవసరం ఉన్నదని బేబీ అన్నారు. కాగా గత లోక్‌సభ ఎన్నికలలో త్రిస్సూర్‌ లోక్‌సభ స్థానంలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన కేంద్ర మంత్రి సురేష్‌ గోపి విజయం సాధించారు. రాష్ట్రంలో బీజేపీకి లభించిన తొలి విజయం అదే.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -