Thursday, January 29, 2026
E-PAPER
Homeతాజా వార్తలుఆ రాష్ట్రాల్లో ఎస్ఐఆర్ గడువు పొడిగించిన ఎన్నికల సంఘం

ఆ రాష్ట్రాల్లో ఎస్ఐఆర్ గడువు పొడిగించిన ఎన్నికల సంఘం

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) గురువారం ఐదు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) గడువును వారం రోజుల పాటు పొడిగించింది. ఈ పొడిగింపు తమిళనాడు, గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఉత్తర ప్రదేశ్, అండమాన్ అండ్ నికోబార్ దీవులకు వర్తిస్తుంది. సవరించిన షెడ్యూల్ ప్రకారం తమిళనాడు, గుజరాత్ రాష్ట్రాలలో ఎస్ఐఆర్ గడువు డిసెంబర్ 14 (ఆదివారం)తో ముగియాల్సి ఉండగా, దీనిని డిసెంబర్ 19 (శుక్రవారం) వరకు పొడిగించారు.

మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, అండమాన్ అండ్ నికోబర్‌లలో డిసెంబర్ 18 నుంచి డిసెంబర్ 23 వరకు, ఉత్తర ప్రదేశ్‌లో డిసెంబర్ 26  నుంచి డిసెంబర్ 31 వరకు గడువును పొడిగించారు. ఎస్ఐఆర్ ప్రక్రియను వ్యవస్థీకృత పద్ధతిలో పూర్తి చేయడానికి, కచ్చితమైన, నవీకరించబడిన ఓటర్ల జాబితాను నిర్ధారించడానికి మరో రెండు వారాల సమయం ఇవ్వాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరిందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి నవదీప్ రిన్వా వెల్లడించారు. మరణించిన, బదిలీ చేయబడిన, గైర్హాజరైన ఓటర్లకు సంబంధించిన వివరాలను ధృవీకరించడానికి వీలుగా గడువును పొడిగించినట్లు ఆయన తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -