మా దగ్గర ఆటంబాంబు లాంటి ఆధారాలున్నాయి
ఈసీని వదలం : లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ: భారత ఎన్నికల సంఘంపై లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మరోసారి నిప్పులు చెరిగారు. బీజేపీ కోసం ఎన్నికల సంఘం ఓట్ల చోరీకి పాల్పడుతోందని విమర్శించారు. ఆ విషయాన్ని రుజువు చేసేందుకు తమవద్ద అణుబాంబు లాంటి ఆధారాలున్నాయని చెప్పారు. ఎస్‌ఐఆర్‌ను వ్యతిరేకిస్తున్న రాహుల్ గాంధీ మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రస్థాయి నుంచి ఓట్ల చౌర్యం జరుగుతోందని తాము ఎప్పటినుంచో అనుమానిస్తున్నా మన్నారు. మధ్యప్రదేశ్, మహారాష్ట్రతోపాటు లోక్‌సభ ఎన్నికల్లోనూ అక్రమాలు జరిగాయని ఆయన విమర్శించారు. ఓటరు సవరణ చేపట్టి కోట్లాది మంది కొత్త ఓటర్లను అదనంగా చేరుస్తున్నారని, దీనిపై మరింత లోతుగా అధ్యయనం చేస్తే ఈసీ వ్యవహారం బయటపడిందని చెప్పారు. ఆరు నెలలపాటు తాము సొంతంగా దర్యాప్తు జరిపి ఆటంబాంబు లాంటి ఆధారాలను సాధించామన్నారు. ఆ బాంబు పేలిన రోజు ఎన్నికల సంఘం దాక్కోవడానికి కూడా అవకాశమే ఉండదని రాహుల్‌గాంధీ వ్యాఖ్యానించారు. బీజేపీ కోసమే ఈసీ ఓట్ల చోరీకి పాల్పడుతోందని, ఇది దేశద్రోహం కంటే తక్కువేం కాదని మండిపడ్డారు. దేశ ప్రయోజనాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్న ఏ ఒక్కరినీ తాము వదిలిపెట్ట బోమని హెచ్చరించారు.
బీజేపీ కోసం ఎన్నికల సంఘం ఓట్ల చోరీ
- Advertisement -
- Advertisement -