Tuesday, November 25, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పల్లెల్లో ఎన్నికల కోలాహలం.. పోలింగ్ ఏర్పాట్లలో అధికారులు

పల్లెల్లో ఎన్నికల కోలాహలం.. పోలింగ్ ఏర్పాట్లలో అధికారులు

- Advertisement -

నవతెలంగాణ – ఆర్మూర్ 
పల్లె పోరు మొదలైంది. గ్రామపంచాయతీ ఎన్నికలలో రిజర్వేషన్ల గెజిట్ నోటిఫికేషన్ విడుదల కాగా.. ఆశావాహులు రంగం సిద్ధం చేసుకునేందుకు ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు. 

నియోజకవర్గంలోని పట్టణ పరిధిలో మామిడిపల్లి, పెర్కిట్ గ్రామాలు మున్సిపల్ లో విలీనం కాగా మొత్తం 14 గ్రామపంచాయతీలు ఉన్నవి. ఇందులో ఐదు మహిళలకు రిజర్వేషన్ కేటాయించడం జరిగింది. మండలంలోని సుర్బిర్యాల్ ఎస్టీ జనరల్, రాంపూర్ జనరల్ మహిళ, పిప్పిరి ఎస్సీ జనరల్,  పల్లె హరిపూర్ ఎస్సీ మహిళ,  మగ్గిడి ,మంతిని గ్రామాలకు బీసీ జనరల్, కోమన్ పల్లి జనరల్ మహిళ, ఖానాపూర్ జనరల్, ఇస్సాపల్లి బీసీ మహిళ ,గోవింద్ పెట్ జనరల్, ఫతేపూర్ జనరల్ మహిళ, చేపూర్ ,అంకాపూర్ గ్రామాలకు జనరల్ ,అంతాపూర్ గ్రామానికి ఎస్సీ జనరల్ కేటాయించినారు.

ఆలూర్ మండలంలోని 11 గ్రామపంచాయతీలు ఉండగా నాలుగు మహిళ స్థానాలకు రిజర్వేషన్లు కేటాయించినారు. ఆలూరు జనరల్, డికంపల్లి బీసీ జనరల్, దేగాం జనరల్, గంగుపల్లి ఎస్సీ జనరల్, గుత్ప ఎస్సీ మహిళ, గుత్పతాండ ఎస్సీ జనరల్, కల్లెడ బిసి మహిళ, మచ్చర్ల జనరల్ మహిళ,  జనరల్ ,రామచంద్ర పల్లి బీసీ జనరల్, రామస్వామి క్యాంపు జనరల్ మహిళలకు కేటాయించినారు. నందిపేట మండలంలోని మొత్తం 22 గ్రామపంచాయతీలు ఉండగా 10 గ్రామ పంచాయతీలకు మహిళల రిజర్వేషన్ కేటాయించినారు. మండలంలోని ఐలాపూర్, లక్కంపల్లి, నందిపేట్ ,సిద్దాపూర్, ఉమ్మేడ, వెల్మల్ గ్రామాలకు జనరల్ కాగా, ఆంధ్ర నగర్ ,సిహెచ్ కొండూరు ,జోర్పూర్ ,రైతు ఫారం గ్రామాలకు జనరల్ మహిళ, మాయాపూర్ ,వన్నెలకే ,జోజిపేట గ్రామాలకు ఎస్టీ జనరల్, బద్గుణ ,కౌలాపూర్ గ్రామాలకు ఎస్సీ మహిళ, బజార్ కొత్తూరు, కంఠం ,షాపూర్ గ్రామాలకు బీసీ జనరల్, చిమ్రాజు పల్లి ,మల్లారం, తల్వేద గ్రామాలకు బీసీ మహిళ రిజర్వేషన్లు కేటాయించినారు. నియోజకవర్గంలోని డొంకేశ్వర్ నూతన మండలంలో 13 గ్రామపంచాయతీలు ఉన్నవి.

మండలంలోని చిన్నయానం కు బీసీ మహిళ, డొంకేశ్వర్ కు బీసీ జనరల్ మహిళ , జి జి నడకుడకు జనరల్ మహిళ, మారంపల్లి గ్రామానికి జనరల్, నికల్పూరు గ్రామానికి జనరల్ మహిళ ,సిర్పూర్ గ్రామానికి ఎస్సీ మహిళ, అన్నారం గ్రామానికి ఎస్సీ దత్తాపూర్ కు ఎస్టి ,గాదె పల్లి కి జనరల్, కోమటిపల్లిఎస్సీ , నూతపల్లికి జనరల్, తుండాకూర్ కు బిసి రిజర్వేషన్లు కేటాయించినారు. కాగా పలు మండలాల్లో  గ్రామపంచాయతీలో రిజర్వేషన్లు ఆశావాహులకు అనుకూలంగా రావడంతో సర్పంచ్ పదవికి పోటీ చేసేందుకు సిద్ధం అవుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -