నవతెలంగాణ -పరకాల
రాబోయే 2వ సాధారణ మున్సిపల్ ఎన్నికలు-2026 నేపథ్యంలో పరకాల పట్టణంలో ఎన్నికల ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా బుధవారం తెలంగాణ ఎన్నికల కమిషన్ నియమించిన ఎన్నికల పరిశీలకులు కె. శివ కుమార్ నాయుడు, హనుమకొండ అదనపు కలెక్టర్ ఎన్. రవి పరకాలలో పర్యటించారు. తొలుత పరకాల పురపాలక సంఘ కార్యాలయంలో ఎన్నికల ప్రక్రియను క్షుణ్ణంగా పరిశీలించిన అధికారులు, అనంతరం గణపతి డిగ్రీ కాలేజీని సందర్శించారు. అక్కడ ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ హాల్, డిస్ట్రిబ్యూషన్ అండ్ రిసెప్షన్ సెంటర్లు వీటిని క్షేత్రస్థాయిలో పరిశీలించి, అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. ఎన్నికల నిర్వహణలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా పక్కాగా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పరకాల ఆర్డీవో డా. కె. నారాయణ, మున్సిపల్ కమిషనర్ ఎస్. అంజయ్య, తహశీల్దార్ టి. విజయలక్ష్మి, ఎంపిడిఓ జి. రవీందర్, రంజిత్, టిపిఓ కె. సుష్మ మరియు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించిన ఎన్నికల పరిశీలకులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



