- Advertisement -
నవతెలంగాణ – సదాశివనగర్
కామారెడ్డి జిల్లా సదాశివనగర్ లో జిల్లా ఎన్నికల పరిశీలకులు సత్యనారాయణ రెడ్డి సదాశివ నగర్ మండల కేంద్రంలో ఆదర్శ పాఠశాలలో జరుగుతున్న ప్రిసైడింగ్ ఆఫీసర్ శిక్షణ కేంద్రాన్ని పరిశీలించారు. అదేవిధంగా మండల పరిషత్ కార్యాలయంలో పోస్టల్ బ్యాలెట్ కేంద్రాన్ని సందర్శించడం జరిగింది. 9వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు ఎన్నికల విధులు వచ్చిన ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ఉపయోగించుకోవాలని తెలిపారు. ఈకార్యక్రమంలో మండల పరిషత్ అధికారి సంతోష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



