అధ్యక్ష, కార్యదర్శులుగా పరశురాములు మదర్
నవతెలంగాణ-పాలకుర్తి
కల్లుగీత కార్మిక సంఘం మండల కమిటీని సోమవారం మండల కేంద్రంలో గల కల్లుగీత కార్మిక సంఘం భవన్ లో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు కమ్మగాని నాగన్న గౌడ్ అధ్యక్షతన జరిగిన కల్లుగీత కార్మిక సంఘం నాల్గవ మహాసభలో కల్లుగీత కార్మిక సంఘం మండల అధ్యక్షునిగా పాలకుర్తి గ్రామానికి చెందిన కమ్మగాని పరశురాములు గౌడ్ ను, ప్రధాన కార్యదర్శిగా ధర్దేపల్లి గ్రామానికి చెందిన తాళ్లపల్లి మదార్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల ఉపాధ్యక్షులుగా గిలకత్తుల సుధాకర్, ఆవుల నాగేష్, బత్తిని శ్రీనివాస్, పులి అశోక్, కారు పోతుల వెంకటయ్య, సహాయ కార్యదర్శులుగా గూడ రవీందర్, దూపటి నరేందర్, పొన్నం సోమయ్య లతోపాటు కమిటీ సభ్యులను ఎన్నుకున్నారు. కల్లుగీత కార్మిక సంఘం నాలుగవ మహాసభలకు ఆ సంఘం జిల్లా గౌరవాధ్యక్షులు కుర్ర ఉప్పలయ్య గౌడ్, ప్రధాన కార్యదర్శి బాల్నే వెంకట మల్లయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా పరశురాములు, మదర్ మాట్లాడుతూ కల్లుగీత కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఉద్యమాలు చేస్తామని తెలిపారు. మా నియామకానికి సహకరించిన కల్లుగీత కార్మికులందరికీ కృతజ్ఞతలు తెలిపారు.
కల్లుగీత కార్మిక సంఘం పాలకుర్తి మండల కమిటీ ఎన్నిక
- Advertisement -
- Advertisement -



