నవతెలంగాణ – ముధోల్
ముధోల్ మండల సర్పంచ్ ల సంఘం కార్యవర్గంను గురువారం వారం ఎన్నుకున్నారు. మండల సర్పంచ్ ల సంఘం గౌరవ అధ్యక్షుడు ఆత్మస్వరుప్(మచ్కల్), అధ్యక్షుడు గా కల్లేడ కిష్టయ్య( బోరిగాం), ఉపాధ్యక్షుడు దుమానాయక్ (ఎడ్ బిడ్ తాండ ), ప్రధాన కార్యదర్శి బోమ్మెలగంగాధర్ (రాంటేక్ ), కోశాధికారి అప్పల రాజు (గన్నోర), మౌనిక మహేందర్ రెడ్డి,లను ఎన్నుకున్నారు. ఆనంతరం సర్పంచ్ ల కార్యవర్గాన్ని మండల బిజెపి సర్పంచ్ ల ఎన్నికల ఇంచార్జీ పట్టేపూరం మోహన్ రెడ్డి ఘనంగా సన్మానించారు. సర్పంచ్ లు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని మండల సర్పంచ్ ల సంఘం అధ్యక్షుడు కల్లేడ కిష్టయ్య అన్నారు. పార్టీల కతీతంగా పనిచేస్తానని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్లు రాంచందర్ రెడ్డి ,నక్క మల్లేష్, గణేష్ యాదవ్,కరిపే రమేష్ , మలింగిలక్ష్మిగంగాధర్,మెత్రి నారాయణ, నాయకులు లక్ష్మినారాయణ, విఠల్ రావు, ధర్మపురి శ్రీనివాస్,లడ్డు పోతన్న,బోరిగాం సాయి, తదితరులు పాల్గొన్నారు.
మండల సర్పంచ్ ల కార్యవర్గం ఎన్నిక
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



