Tuesday, May 13, 2025
Homeతెలంగాణ రౌండప్మండల సమాఖ్య నూతన కమిటీ ఎన్నిక.!

మండల సమాఖ్య నూతన కమిటీ ఎన్నిక.!

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు: మహిళ స్వయం సహాయక సంఘాలకు నూతన మండల సమాఖ్య సంఘం కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకొన్నారు. జిల్లా ప్రాజెక్ట్ అధికారి ఆదేశాల మేరకు మంగళవారం మండలంలోని కొయ్యుర్ శ్రీలక్ష్మీ సమాఖ్య సంఘం కార్యాలయంలో జిల్లా నుంచి హాజరైన (సిఅర్పిలు) ఎన్నికల సంఘం అధికారులుగా వ్యవహరించి, మండలంలోని అన్ని గ్రామాల్లో ఉన్న 27 స్వయం సహాయక సంఘాల్లో నుంచి ముగ్గురు చొప్పున తీసుకొని ఆసక్తి ఉన్న మహిళలకు సమావేశం నిర్వహించి, ఏకగ్రీవంగా చీటీలు రాసి ఎన్నికకు మద్దతు తెలిపారు. మండల సమాఖ్య అధ్యక్షురాలుగా పెద్దతూండ్ల గ్రామానికి చెందిన మూల శారద, ప్రధాన కార్యదర్శిగా ఆన్ సాన్ పల్లి గ్రామానికి చెందిన లౌడ్య సునీత, కోశాధికారిగా కొండంపేట గ్రామానికి చెందిన అబ్బనవేన లావణ్య లు ఎన్నికయ్యారు. ఈ కమిటీ పదవికాలం మూడు సంవత్సరాలు కొనసాగునట్లుగా అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీఎం కమల, సిసిలు, విఓఎలు, స్వయం సహాయక మహిళలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -