నవతెలంగాణ – ఆర్మూర్
మున్సిపల్ పరిధిలోని హౌసింగ్ బోర్డ్ కాలనీ పద్మశాలి ఆరవ తర్ప ఎన్నికలు ఆదివారం నిర్వహించారు. ఈ ఎన్నికలకు ముఖ్యఅతిథిగా ఈ ఆర్ ఫౌండేషన్ చైర్మన్ ఈరవత్రి రాజశేఖర్ ను ఆహ్వానించారు. ఈ సందర్భంగా తన వంతుగా రూ. 10 వేలను ఆరవతర్ప సంఘానికి అందజేశారు. ఈ ఎన్నికలలో అధ్యక్ష కార్యదర్శుల పదవులకు ఒకే నామినేషన్లు రావడంతో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
అధ్యక్షులుగా కురుకెళ్లి ఆత్మచరణ్, ప్రధాన కార్యదర్శిగా భాస్కర్, లను సంఘ సభ్యులు ఎన్నుకొని, వారిని శాలువాతో సన్మాని శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ చైర్మన్ మాట్లాడుతూ నూతనంగా ఎన్నికైన వారికి శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తూ, పద్మశాలీలు రాజకీయంగా ఎదగాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. పద్మశాలీల సమస్యల పట్ల స్పందిస్తూ, కుల బాంధవుల అభివృద్ధికై పాటుపడాలని నూతన కార్యవర్గానికి ఆయన సూచనప్రాయంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ అధ్యక్ష కార్యదర్శులు వేముల ప్రకాష్, సురుకుట్ల భూమేష్, జ్ఞానేశ్వర్, లక్క పత్రి నరసయ్య, నరసయ్య తదితరులు పాల్గొన్నారు.



