Saturday, August 30, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్బంజారా సేవా సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక

బంజారా సేవా సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక

- Advertisement -

అధ్యక్షులుగా జగదీష్ ఎన్నిక..
నవతెలంగాణ – డిచ్ పల్లి
: డిచ్ పల్లి బంజారా సేవా సంఘం నూతన కార్యవర్గాన్ని సోమవారం ఎకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండలంలోని సాంపల్లి తండా కు చెందిన రాథోడ్ జగదీష్ అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. వర్కింగ్ ప్రెసిడెంట్ గా  సురేష్, ఉపాధ్యక్షునిగా  సేవాలాల్, ప్రధాన కార్యదర్శిగా శంకర్, జాయింట్ సెక్రెటరీ సుధాకర్, బిక్యా,కోశాధికారిగా ప్రకాష్, కల్చరల్ సెక్రెటరీ  బీమా ,  కార్యవర్గ సభ్యులుగా సర్దార్, రఘునాథ్, మోహన్ , బి.గోపాల్, రఘు,సుదర్శన్  లను ఎన్నుకున్నారు. ఈ ఎన్నికల కోసం మండలం లోని 14 తండాల కు చేందిన  పెద్ద మనుషులు, కారో బార్లు  హాజరై కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు. నూతన కార్యవర్గానికి శాలువా పూల మాలలతో  ఘనంగా సన్మానించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ తార చంద్  నాయక్ హాజరయ్యారు ఆయనతోపాటు ఎలక్షన్ ఆఫీసర్ బాబు రామ్ నాయక్, అబ్జర్వర్ బాదావత్ గోపాల్  పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ తారాచంద్  నాయక్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని బంజారా సోదరులందరికీ ఓకే తాటిపై తేవాలని  బంజారా సేవా సంఘం ఎంతగానో కృషి చేస్తుందని, బంజారాల  హక్కులకై నిరంతర పోరాటం చేస్తున్నదని పేర్కొన్నారు. ఈ సందర్భంగా డిచ్పల్లి మండలంలో  నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా 14 తండా వాసుల ఏకగ్రీవ తీర్మానంతో  ఎన్నుకున్నందుకు నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. నూతన కార్యవర్గం బంజారాల  అభివృద్ధికి కృషి చేయాలని  ఆయన కోరారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad