నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ అసిస్టెంట్ ఇంజినీర్స్ అసోసియేషన్ (టీఎస్‌ఈఏఈఏ) నూతన అధ్యక్షుడిగా ట్రాన్స్‌కోలో ఏఈగా పనిచేస్తున్న జీ పవన్‌కుమార్, ప్రధాన కార్యదర్శిగా కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ (కేటీపీఎస్)లో ఏఈగా పనిచేస్తున్న టీ మహేశ్ ఎన్నికయ్యారు. అసోసియేషన్ నూతన కార్యవర్గ ఎన్నికలు ఈ నెల 2వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించారు. విద్యుత్ సంస్థల్లోని దాదాపు 2,500 మంది అసిస్టెంట్ ఇంజినీర్లు ఈ ఎన్నికల్లో పాల్గొన్నారు. రాష్ట్రంలోని నాలుగు ప్రధాన విద్యుత్ సంస్థల కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. దాదాపు 14 ఏండ్ల తర్వాత ఈ అసోసియేషన్‌కు ఎన్నికలు జరగడం విశేషం. కేంద్ర కార్యవర్గంలో అసోసియేట్ ప్రెసిడెంట్‌గా కే కుమారస్వామి, అదనపు జనరల్ సెక్రటరీగా కే రామకృష్ణ, అడ్మిన్ సెక్రటరీగా ఎమ్ చందు, ఫైనాన్స్ సెక్రటరీగా జీ శ్రీపాల్ రెడ్డి, టెక్నికల్ సెక్రటరీగా హెచ్ రంజిత్‌రెడ్డి, పబ్లిసిటీ సెక్రటరీగా వీ మహిపాల్ ఎన్నికయ్యారు. వీరితో పాటు టీజీజెన్‌కో వైస్ ప్రెసిడెంట్‌గా ఆర్ కిరణ్, కంపెనీ సెక్రటరీగా జీ శ్రీకాంత్ ఎన్నికయ్యారు. టీజీ ట్రాన్స్‌కో వైస్ ప్రెసిడెంట్‌గా పీ రజినీకాంత్, కంపెనీ సెక్రటరీగా బీ నరేష్‌కుమార్, టీజీఎస్పీడీసీఎల్ వైస్ ప్రెసిడెంట్‌గా జీ దయానంద్, కంపెనీ సెక్రటరీగా టీ సందీప్‌రెడ్డి, టీజీఎన్పీడీసీఎల్ వైస్ ప్రెసిడెంట్‌గా టీ నవీన్, కంపెనీ సెక్రటరీగా ఎమ్ దిలీప్‌కుమార్ ఎన్నికయ్యారు. అసిస్టెంట్ ఇంజినీర్ల సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తామని అసోసియేషన్ నూతన ప్రతినిధులు తెలిపారు.
ఎలక్ట్రిసిటీ అసిస్టెంట్ ఇంజినీర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES