అధ్యక్ష కార్యదర్శులుగా మద్దెపురం రాజు, దయ్యాల నరసింహ…
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
జులై 22న రాయగిరి లోని లింగ బసవ గార్డెన్లో జరిగిన జిఎంపిఎస్ జిల్లా మూడవ మహాసభలో నూతన కమిటీని ఎన్నుకున్నారు. జిల్లా గౌరవ అధ్యక్షులుగా బండారు నరసింహ, జిల్లా అధ్యక్షులుగా మద్దెపురం రాజు , జిల్లా ప్రధాన కార్యదర్శిగా దయ్యాల నరసింహ తోపాటుగా మరొక 21 మంది కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. జిల్లా ఉపాధ్యక్షులుగా బుడమ శ్రీశైలం, మద్దిపురం బాల్ నరసింహ, సహాయ కార్యదర్శులుగా కొండే శ్రీశైలం, నారీ వెంకటేశం, జిల్లా కమిటీ సభ్యులుగా పాక జహంగీర్, ర్యాకల శ్రీనివాస్, మన్నేబోయిన రాజలింగం, కడెం బీరప్ప, క్యాసాని నవీన్, కర్రె మల్లేష్, నారి మల్లేష్, బుగ్గ లక్ష్మయ్య, నర్రముల గణేష్, కళ్లెం సోమయ్య, గున్నబోయిన ఐలయ్య, జనిగల యాదయ్య, గాజుల అంజయ్య, కడారి కృష్ణ. లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
ఈ సందర్భంగా ఎన్నికైన నూతన జిల్లా కమిటీ సమావేశం బుధవారం లింగ బసవ గార్డెన్లో నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి దయ్యాల నరసింహ మాట్లాడుతూ గొర్రెల కాపలా గుర్తింపు కార్డులు ఇవ్వాలని , 50 సంవత్సరాలు దాటిన వారికి పెన్షన్ ఇవ్వాలని, కుక్కల దాడిగా చనిపోయిన గొర్రెలకు నష్టపరిగా ఇవ్వాలని కోరారు. గొర్రెలకు ఉచిత బీమా సౌకర్యం, గొర్రెల కాపరులకు ప్రమాద బీమా సౌకర్యం అమలుచేసి, 10 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలన్నారు. విత్తన పోటీలు ఉచితంగా పంపిణీ చేయాలని, నగదు బదిలీ వెంటనే ప్రారంభించాలని, నేషనల్ లైవ్ స్టాక్స్ పథకంలో చదువుకున్న నిరుద్యోగ యువతకు సొసైటీ జమనతుగా రుణాలు ఇవ్వాలని కోరారు. మూడు నెలలకు ఒకసారి నటల నివారణ మందులు పంపిణీ చేయాలని, ఎన్సీడీసీ బకాయి రుణాలు మాఫీ చేయాలని, చెల్లించిన వారికి రుణమాఫీ తిరిగి ఇవ్వాలని కోరారు. అటవీ భూములో గొర్రెల మేతకు అనుమతించాలని, గ్రామ సొసైటీల పేద కాలంలో ఎన్నికలు నిర్వహించి జిల్లా యూనియన్ ఏర్పాటు చేసి, నూతన భవనం కోసం స్థలం కేటాయించాలని కోరారు.
ఉపాధి హామీ పథకంలో గొర్రెల షెడ్లు నిర్మించి, గ్రామాల్లో జీవాలకు నోటితోట్లు నిర్మించాలన్నారు. సొసైటీలకు సొంత భవనాలు నిర్మిస్తూ, 1016, 559 జీవోలను పటిష్టంగా అమలు చేయాలని కోరారు. జిల్లా కేంద్రంలో దొడ్డి కొమురయ్య విగ్రహం ఏర్పాటుచేసి విజ్ఞాన కేంద్రం నిర్మాణానికి స్థలం కేటాయించాలన్నారు. పశుసంవర్ధక శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసి, మూగజీవాలకు సకాలంలో వైద్యం అందించాలని , పై సమస్యలను రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకుపోవాలని కోరుతూ జిల్లా మహాసభలలో సమస్యల పరిష్కారం కోరుతూ ఏకగ్రీవ తీర్మానం చేశారు.