అధ్యక్షులుగా యాకూబ్ పాషా, కార్యదర్శిగా బిక్షపతి
నవతెలంగాణ – నర్సింహులపేట
నర్సింహులపేట మండల గ్రామ పాలన అధికారుల (జీపీవోల) నూతన కార్యవర్గాన్ని బుధవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల అధ్యక్షులుగా ఎండి యాకూబ్ పాషా ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా రామచంద్రు, కార్యదర్శిగా బిక్షపతి, కోశాధికారిగా రాధిక, సలహాదారులుగా వెంకన్న, బాలరాజు, ఐలేష్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిపిఓ నూతన కార్యవర్గ సభ్యులు తహసిల్దార్ రమేష్ బాబును మర్యాదపూర్వకంగా కలిసి నూతన కార్యవర్గ జాబితాను అందజేశారు. అనంతరం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం అభినందనీయమని, కార్యవర్గ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా నూతన అధ్యక్షులు యాకూబ్ పాషా, బిక్షపతి మాట్లాడుతూ గత రెండు నెలల క్రితమే గ్రామ పాలన అధికారులుగా నియమకం పొందామని, మండలంలో గ్రామ పాలన అధికారులు ఎదుర్కొంటున్న సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే విధంగా నూతన కార్యవర్గ సభ్యులు కలిసి కట్టుగా ఉంటామని పేర్కొన్నారు.



