డివిజన్ అధ్యక్షులు గా సత్యనారాయణ
నవతెలంగాణ – మిర్యాలగూడ
తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ మిర్యాలగూడ డివిజన్ నూతన కమిటీని ఆదివారం ఎన్నుకున్నారు. డివిజన్ అధ్యక్షుడుగా జీ. సత్యనారాయణ ఉపాధ్యక్షులుగా పి రామవతారం, ఆర్ జ్ఞానేశ్వర్ రెడ్డి స్వరూప రాణి ప్రధాన కార్యదర్శిగా పులి కృష్ణమూర్తి సహాయ కార్యదర్శిగా ఎం లక్ష్మీనారాయణ పి మాధవరెడ్డి వై దుర్గారాణి కోశాధికారిగా కేశవులు కార్యవర్గ సభ్యులుగా ఈ వెంకటరమణారెడ్డి, ఇజాజ్ అహ్మద్, రామ్ చంద్రు, ఏం రేణుక, నాగువంచ నరసింహారావు లను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షులు సత్యనారాయణ మాట్లాడుతూ రిటైర్డ్ ఉద్యోగులు, ఆల్ పెన్షనర్స్ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని చెప్పారు. సంఘం బలోపేతానికి పాటు పడతానని చెప్పారు. తనను ఎన్నుకున్నందుకు సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.
టాప్రా నూతన కమిటీ ఎన్నిక
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



