Tuesday, December 30, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంటీఎస్‌పీఈజేఏసీ నూతన కమిటీ ఎన్నిక

టీఎస్‌పీఈజేఏసీ నూతన కమిటీ ఎన్నిక

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
తెలంగాణ స్టేట్‌ పవర్‌ ఎంప్లాయీస్‌ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ (టీఎస్‌పీఈజేఏసీ) నూతన కమిటీ ఎన్నిక జరిగింది. పవర్‌ డిప్లొమా ఇంజినీర్స్‌ అసోసియేషన్‌ భవన్‌లో సోమవారం 23 సంఘాలతో జేఏసీని ఏర్పాటు చేశారు. దీనికి చైర్మెన్‌గా జీ సాయిబాబు (1104), సెక్రటరీ జనరల్‌గా ఎన్‌ శ్రీధర్‌ (327), కన్వీనర్‌గా పీ రత్నాకరరావు (టీజీపీఈఏ), కో కన్వీనర్‌గా బీసీ రెడ్డి ఎన్నికయ్యారు. వైస్‌ చైర్మెన్లుగా టీ మహేశ్‌, ఎంఏ వజీర్‌, జాయింట్‌ సెక్రటరీలుగా వీ గోవర్థన్‌, డీ శ్యామ్‌మనోహర్‌, ఎం తులసీ నాగరాణి, ఫైనాన్స్‌ సెక్రటరీగా ఎం కరుణాకర్‌రెడ్డి, ఆర్గనైజింగ్‌ సెక్రటరీలుగా ఎమ్‌ రాంజీ, ఎమ్‌ నెహ్రూ, ఎస్‌ లోహితానంద్‌, జీ నాగరాజు, కే సత్యనారాయణరావు, ఆర్‌ మోసెస్‌, సీహెచ్‌ గిరిధర్‌, పీ శ్రీనివాస్‌, కేవీ రామారావు, జీ సతీశ్‌కుమార్‌, జీ అర్వింద్‌కుమార్‌, ఆర్‌ మురళి ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. విద్యుత్‌ సంస్థల్ని ప్రయివేటీకరిస్తే సహించేది లేదని హెచ్చరించారు. 8 ప్రధాన డిమాండ్ల పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -