Friday, September 5, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్అడ్డ కూలీల సంఘం డివిజన్ కమిటీ ఎన్నిక

అడ్డ కూలీల సంఘం డివిజన్ కమిటీ ఎన్నిక

- Advertisement -

నవతెలంగాణ – అచ్చంపేట
అడ్డ కూలీల సంఘం అచ్చంపేట నూతన డివిజన్ కమిటీని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు సి ఆంజనేయులు రైతు సంఘం జిల్లా నాయకులు దేశనాయక్ ఆధ్వర్యంలో కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అచ్చంపేట మండల కేంద్రంలో కూలీలకు లేబర్  అడ్డ నిర్మాణం ప్రభుత్వం చూపించాలని కోరారు ప్రతికూలికి ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు.

ప్రతి అడ్డ కూలికి ఒకరోజు వేతనం వెయ్యి రూపాయలు కూలి ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. ప్రమాదంలో మరణించిన గాయపడిన కూలికి ఆరోగ్య ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించి,  ప్రభుత్వం కూలీలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ కార్మికుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక లేబర్ డిపార్ట్మెంట్ ఏర్పాటు చేయాలని కోరారు. 

వ్యవసాయ కూలీలందరికీ రేషన్ కార్డులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.  ఇండ్లు లేని కూలీ రైతులకి స్థలం కేటాయించి ఇందిరమ్మ ఇండ్లు అర్హులందరికీ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 57 సంవత్సరాలు నిండిన ప్రతి కార్మికుడికి కూలికి పెన్షన్లు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ కార్మికులందరికీ నిధులు కేటాయించి వాళ్ళ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 

కూలిల సంఘం డివిజన్ కమిటీ ఎన్నిక 
డివిజన్ అధ్యక్షులుగా కే వెంకటయ్య, ఉపాధ్యక్షులు గా కేతావత్ లక్ష్మణ్, లాలూ నాయక్,  కవిత, డివిజన్ ప్రధాన కార్యదర్శి గుంటి శంకర్, డివిజన్ సహకార దర్శి టీక్య రాజు, తారా సింగ్, దేవేందర్సి,  ఆంజనేయులు, రాములు, డివిజన్ కమిటీ సభ్యులు  దేవేందర్, శాంతి,మంజుల, లక్ష్మి జైపాల్, లక్ష్మయ్య, పృద్వి, మహేందర్, గంటి కృష్ణయ్యలు ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు సైదులు, మల్లేష్, రాములు, పర్వతాలు, రేనయ్య, పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad