Thursday, December 25, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంఎక్సైజ్‌ సీఐ, ఎస్సైల సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక

ఎక్సైజ్‌ సీఐ, ఎస్సైల సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక

- Advertisement -

అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా సూర కృష్ణయ్య, కే చిరంజీవి

నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
నూతనంగా తెలంగాణ ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ సీఐ, ఎస్‌ఐ సంఘం ఏర్పడింది. దీనిలో ఆ శాఖలోని 762 మంది సీఐలు, ఎస్సైలు సభ్యులుగా ఉన్నారు. ఈ సంఘం ఎన్నికలు హైదరాబాద్‌లోని రైల్వే ఆఫీసర్స్‌ క్లబ్‌లో జరిగాయి. తొలిసారిగా ఏర్పడిన ఈ సంఘానికి అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా సూర కృష్ణయ్య, కే చిరంజీవి ఎన్నికయ్యారు. కోశాధికారిగా డి.భాస్కర్‌రావులు ఎన్నికయ్యారు. వీరిలోపాటు ముగ్గురు అసోసియేట్‌ అధ్యక్షులు, ముగ్గురు ఉపాధ్యక్షులు, ముగ్గురు సంయుక్త కార్యదర్శులు, ఇద్దరు జోనల్‌ కార్యదర్శులు, అరుగురు సభ్యులు ఎన్నికయ్యారు. ఎన్నికల అధికారులుగా ఎంపీఆర్‌ చంద్రశేఖర్‌, జిన్నా నాగార్జునరెడ్డి, సహయక ఎన్నికల అధికారిగా మంగు శ్రవణ్‌, పరిశీలకులుగా మధుబాబు, రామకృష్ణ, శ్రీనివాసరావు వ్యవహరించారు. నూతన సంఘం కార్యవర్గ సభ్యులు ఎక్సైజ్‌శాఖ ప్రిన్సిపల్‌ సెకట్రరీ రఘునందన్‌రావు, కమిషనర్‌ సి.హరికిరణ్‌, అడిషనల్‌ కమిషనర్‌ సయ్యద్‌ యాసిన్‌ ఖురేషిలను మర్యాద పూర్వకంగా కలిశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -