Tuesday, December 30, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంకెమిస్ట్రీ, డ్రగిస్ట్‌ అసోసియేషన్‌ రాష్ట్ర నూతన కమిటీ ఎన్నిక

కెమిస్ట్రీ, డ్రగిస్ట్‌ అసోసియేషన్‌ రాష్ట్ర నూతన కమిటీ ఎన్నిక

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్‌
కెమిస్ట్రీ, డ్రగిస్ట్‌ అసోషియేషన్‌ రాష్ట్ర నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రాష్ట్ర అధ్యక్షులుగా కొత్తపల్లి శ్రీనివాస్‌, ప్రధాన కార్యదర్శిగా తొడుపునూరి రాజు, కోశాధికారి కృష్ణకుమార్‌ నూతనంగా ఎన్నికయ్యారు. అదే విధంగా హైదరాబాద్‌ కెమిస్ట్రీ, డ్రగిస్ట్‌ అసోషియేషన్‌ అధ్యక్షులు శ్రీధర్‌గుప్త, ప్రధాన కార్యదర్శి సంతోష్‌కుమార్‌, ట్రెజరరీ నజీబిన్‌, అంబేద్కర్‌ జోన్‌ అధ్యక్షులు నంగునూరి రమేష్‌ హాజరై రాష్ట్ర నూతన కమిటీని సన్మానించారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నుకోబడిన నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో 48000 మెడికల్‌ షాపుల యజమానులు 33 జిల్లాల అసోసియేషన్‌ ప్రతినిధులు అందరు కలిసి ఓటింగ్‌కు హాజరై ఎన్నుకోవడం గర్వకారణమన్నారు. ప్రజలకు సేవ చేయడానికి మెడికల్‌ అసోషియేషన్‌ ఎల్లప్పుడు ముందుగా ఉంటుందన్నారు. స్వార్దం లేకుండా ఎల్లప్పుడు ముందడుగు వేస్తామన్నారు. పేదలక ఏలాంటి ఇబ్బందులు లేకుండా వారికి నాణ్యమైన రూపంలో మెడికల్‌ షాపులను నిర్వహించాలన్నారు. అసోషియేషన్‌ బలోపేతం కోసం మరింత కృషి చేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా గెలుపొందిన అసోషియేషన్‌ సభ్యులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో అసోషియేషన్‌ సభ్యులు డి.హనుమంతరావు, కాశినాథ్‌, రంగం శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -