- Advertisement -
సత్యనారాయణ రెడ్డి
నవతెలంగాణ – పెద్దకొడప్ గల్
మండలం పెద్దకొడప్ గల్ పంచాయతీలోనామినేషన్ పరిశీలన కేంద్రాలను సాధారణ ఎన్నికల అధికారి సత్యనారాయణ రెడ్డి పరిశీలించారు. వారు మాట్లాడుతూ సర్పంచ్ వార్డు సభ్యుల ఎన్నిక కోసం జారీ చేసిన నోటిఫికేషన్ వివరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఇలాంటి పొరపాట్లకు తావు లేకుండా ఎన్నికల ప్రక్రియను సజావుగా నిర్వహించాలన్నారు. నిబంధనలకు అనుగుణంగా విధులు నిర్వహించాలన్నారు. ఆయన వెంట సదాశివ్ నగర్ ఎంపీఓ సురేందర్ రెడ్డి,ఎంపీడీవో అభినయ్ చందర్,ఎంపీఓ లక్ష్మీకాంతరెడ్డి, రిటర్నింగ్ అధికారులు రాజారాం, శ్రీనివాస్,పంచాయతీ సెక్రటరీ శ్రీనివాస్,పలువురు గ్రామపంచాయతీ సెక్రటరీలు పాల్గొన్నారు.
- Advertisement -



