- Advertisement -
నవతెలంగాణ కురవి: మహబూబాబాద్ జిల్లా కురవి మండలం చంద్యాతండా పోలింగ్ కేంద్రంలో పోలింగ్ అధికారి శ్రీనివాస్ బీపీ డౌన్ అయి స్పృహతప్పి పడిపోయారు. వెంటనే అతన్ని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఈ ఘటనతో పోలింగ్ కేంద్రంలో కొద్దిసేపు కలకలం రేగింది. ఎన్నికల విధులు నిర్వహిస్తున్న సమయంలోనే ఈ దుర్ఘటన చోటుచేసుకోవడం గమనార్హం.
- Advertisement -



