- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
రేమ్యునరేషన్ పెంచాలని, ట్రెనింగ్ రేమ్యునరేషన్ ఇవ్వాలంటూ పంచాయతీ ఎన్నికల నిర్వహించే పిఓ, ఓపిఓ లు 314 మంది మంగళవారం మండల కేంద్రమైన తాడిచెర్ల ఎన్నికల పోలింగ్ కేంద్రాల వద్ద ఆందోళన చేపట్టారు. గతం కంటే రేమ్యునరేషన్ ఎక్కువగా ఇవ్వాలని సుమారుగా గంటపాటు ఆందోళన చేశారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళుతామని, అక్కడ ఎలా రేమ్యునరేషన్ ఇస్తే అలా వచ్చేలా చూస్తామని ఎంపిడిఓ క్రాంతి కుమార్ హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించినట్లుగా తెలుస్తోంది.
- Advertisement -



