Monday, September 8, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్ఎన్నికల్లో ఇచ్చిన హామీని అమలు చేయాలి 

ఎన్నికల్లో ఇచ్చిన హామీని అమలు చేయాలి 

- Advertisement -

– వికలాంగులకు పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు బాలరాజు గౌడ్ 
నవతెలంగాణ –  కామారెడ్డి

కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో వికలాంగులకు వృద్ధులకు వితంతువులకు పెన్షన్లు పెంచుతామని  ఇచ్చిన హామీలను అమలు చేయాలని వికలాంగుల పోరాట సమితి ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ను ముట్టడించారు. ఈ సందర్భంగా వికలాంగుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు బాల్రాజ్ గౌడ్ మాట్లాడుతూ..వికలాంగులకు, వృద్ధులకు, వితంతువులకు, బిడి కార్మికులకు, చేనేత పింఛన్దారులకు అందరికీ పెన్షన్లను పెంచుతామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఇప్పటివరకు రెండు సంవత్సరాలు గడిచిన  పెన్షన్ పెంచలేదని అన్నారు. కలెక్టరేట్ల ముందు వికలాంగుల మందిరం వికలాంగులకు పోరాట సమితి ఆధ్వర్యంలో కలెక్టర్ ఆఫీస్ లో ముందు ధర్నా నిర్వహించడం జరిగిందన్నారు. ఈ  కార్యక్రమంలో రాష్ట్ర ఇంచార్జ్ మంతెన సామెల్, జిల్లా మహిళ విభాగం అధ్యక్షురాలు అఫీజా, జిల్లా ఉపాధ్యక్షురాలు రాజ్యలక్ష్మి, రాజనర్సు, శివరాజు, సతీష్, జ్యోతి, రాజిరెడ్డి, స్వామి,  ఎంఆర్పిఎస్ జిల్లా అధ్యక్షురాలు సత్తి గారి లక్ష్మి, యాదగిరి, సాయిలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad