నవతెలంగాణ-రామారెడ్డి
స్థానిక సంస్థల ఎన్నికల నగర మోగనున్నందున రామారెడ్డి మండల కాంగ్రెస్ నాయకులు మాజీ మండల అధ్యక్షులు గొల్లపల్లి లక్ష్మా గౌడ్ ఇంట్లో సమీక్ష నిర్వహించారు. సోమవారం జిల్లా పరిషత్ మాజీ ఫ్లోర్ లీడర్ నా రెడ్డి మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా, కలసికట్టుగా పనిచేసి వార్డు మెంబర్ నుండి జెడ్పిటిసి వరకు కాంగ్రెస్ జెండా ఎగిరేల కష్టపడవలసి ఉంటుందని అన్నారు. రాష్ట్రంలో బి ఆర్ ఎస్ గాలి వీస్తున్న సమయంలో, రామారెడ్డి కాంగ్రెస్ వీర సైనికులు, అభిమానులు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నన్ను గెలిపించి, కాంగ్రెస్ జెండాను ఎగరవేసి ఘనత కాంగ్రెస్ వీర సైనికులదని, అదే పట్టుదలతో పని చేద్దామని వారందరికీ సూచించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
మాజీ మండల అధ్యక్షుని ఇంట్లో ఎన్నికల సమీక్ష
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES