నవతెలంగాణ – పెద్దవంగర
పారదర్శక ఎన్నికల ప్రక్రియకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఎంపీడీవో వేణుమాధవ్ అన్నారు. మండల కేంద్రంలోని రైతు వేదికలో శనివారం ఎన్నికల నిర్వహణపై రాజకీయ పార్టీల నాయకులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల కమిషన్ షెడ్యూల్ ప్రకటించడంతో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులోకి వచ్చిందన్నారు. ఎన్నికల కోడ్ అమలులోకి రాగానే ప్రతి ఒక్కరికి నిబంధనలో వర్తిస్తాయని పేర్కొన్నారు. నామినేషన్ ప్రక్రియ నుంచి ఎన్నికల ఫలితాల వరకు నిబంధనలకు అనుగుణంగా నాయకులు పని చేయాలన్నారు. ఎన్నికల నోటిఫికేషన్, నామినేషన్‌ల ప్రక్రియ పరిశీలన, డ్యూటీలో ఉండే అభ్యర్థుల జాబితా, ఓటరు స్లిప్‌ల పంపిణీ, మోడల్‌కోర్ ఆప్ కండక్ట్ పలు అంశాలపై అవగాహన కల్పించారు. మండలంలోని 192 వార్డుల్లో మొత్తం 25,409 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో స్త్రీలు 12,898 మంది, పురుషులు 12,511 మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు. ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహిస్తామని ఎంపీడీవో పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆర్ఐ భూక్యా లష్కర్, కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, టీడీపీ, జనసేన మండల నాయకులు పాల్గొన్నారు.
ఎన్నికల నిబంధనలు పాటించాలి: ఎంపీడీవో
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES