మండల ఇంచార్జి ఎంపిడిఓ శ్రీరామూర్తి
నవతెలంగాణ–మల్హర్ రావు
తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమీషన్ గ్రామ పంచాయతీలు, మండల పరిషత్ లకు ఎన్నికలు నిర్వహించడానికి ఇటీవల నోటిఫికేషన్ షెడ్యూల్ జారీ చేసిన విషయం విదితమే. ఈ క్రమంలో వెంటనే ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు చేయాలని ఆదేశించిన నేపథ్యంలో మండల పరిధిలోని ప్రజా ప్రతినిధులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు సహకరించాలని మండల ఇంచార్జి ఎంపీడిఓ శ్రీరామూర్తి మంగళవారం ఒక ప్రకటనలో కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసిన 24 గంటల లోపు ప్రభుత్వ కార్యాలయాలలో ఎలాంటి ప్రజా ప్రతినిధుల ఫోటోలు కానీ, రాజకీయ రాతలు కానీ తుడిచి వేయాలని, అలాగే 48 గంటల లోపు పబ్లిక్ స్థలాలలో 72 గంటల లోపు ప్రయివేటు ప్రాపర్టీలలో తొలగించాలని, మండలంలోని ఆయా గ్రామపంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు.
ఎన్నికల నియమావళిని పకడ్బందీగా అమలు చేయాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES