నవతెలంగాణ – తొగుట
గ్రామపంచాయతీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసామని ఎంపీడీవో జి. నాగేశ్వర్ తెలిపారు. శనివారం రెండో దప గ్రామపంచాయతీ ఎన్నికలలో భాగంగా మండలంలోని 17 గ్రామ పంచాయతీల కు 58 మంది సర్పంచ్ అభ్యర్థులు పోటీలో ఉన్నారని అన్నారు. 152 వార్డులకు 330 మంది వార్డు సభ్యులు పోటీలో నిలిచారని చెప్పారు. ఎన్నికలు ముగిసిన అనంతరం కౌంటింగ్ కోసం ప్రత్యేక ఏర్పా ట్లు చేశామని అన్నారు. మైక్రో అబ్జర్వర్ 4, వెబ్ కాస్టింగ్ 3, 3 జోన్లు, 6 రుట్లను ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. వెంకట్రావు పేట, పెద్ద మాసాన్ పల్లి, గుడికందుల, కాన్గల్ 4 క్రిటికల్ గ్రామాలలో ప్రత్యేక నిగా బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఆయా గ్రామాలకు ప్రత్యేక ఎస్కార్ట్ ద్వారా సిబ్బందిని ఎన్నికల సామాగ్రిని తరలించామని అన్నారు. మండల కేంద్రమైన తొగుటలో 2425 మంది అత్యధికంగా ఓటర్లు ఉండగా, ఎల్ బంజేరు పల్లిలో 346 మంది ఓటర్లు ఉన్నారు.
– తొలి సరిగా వార్డులకు ఎన్నికలు..
మండలంలోని చందాపూర్ గ్రామపంచాయతీలో వార్డులకు తొలిసారిగా ఎన్నికలు నిర్వహిస్తున్నా రు. వెంకట్రావుపేట గ్రామపంచాయతీ నుండి 1995 చందా పూర్ గ్రామ పంచాయతీ విడి పోయింది. 8 వార్డులతో నూతన గ్రామ పంచాయ తీ ఏర్పడింది. గత 30 సంవత్సరాల నుండి వార్డు సభ్యులను గ్రామస్థుల సమక్షంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తొలిసారిగా వార్డు సభ్యులను ఓటు వేసి ఎన్నుకోవడం ఇదే మొదటిసారి కావడం విశేషం. ఇందులో 2 వార్డులలో ఒక్కొక్కరు నామి నేషన్ వేయడం ద్వారా ఏకగ్రీవమయ్యాయి. మిగ తా 6 వార్డులకు మొదటిసారిగా ఎన్నికలు నిర్వ హిస్తున్నారు.



