– రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యదర్శికి తపస్ వినతి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలోని ఎన్నికల నిర్వహణలో పనిచేస్తున్న సిబ్బందికి పనికితగ్గ రెమ్యూనరేషన్‌ను చెల్లించాలని తపస్ రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ను డిమాండ్ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యదర్శి లింగ్యానాయక్‌ను తపస్ రాష్ట్ర అధ్యక్షులు వోడ్నాల రాజశేఖర్, ప్రధాన కార్యదర్శి తెల్కలపల్లి పెంటయ్య, ఆర్గనైజర్ సెక్రెటరీ హన్మంతరావు, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు కాశీరావు మంగళవారం హైదరాబాద్‌లో కలిసి వినతిపత్రం అందజేశారు. పంచాయతీ ఎన్నికల్లో స్టేజ్-1, స్టేజ్-2 పీవోలకు, ఇతర ఎన్నికల సిబ్బందికి ఇచ్చిన రెమ్యూనరేషన్‌ను పున:సమీక్షించాలని కోరారు. రానున్న మున్సిపల్, మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికల్లో పనికి తగ్గ రెమ్యూనరేషన్ ఇవ్వాలని సూచించారు. గతేడాది డిసెంబర్ 10న పంచాయతీరాజ్ శాఖ ఇచ్చిన మెమోను వెంటనే ఉపసంహరించుకోవాలని కోరారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిర్దేశించిన రేట్ల ప్రకారం పూర్తి టీఏ, డీఏ చెల్లించేలా తగు ఆదేశాలను జారీ చేయాలని సూచించారు. విధులు పూర్తి చేసిన వారికి తేడా మొత్తాన్ని వెంటనే విడుదల చేయాలని తెలిపారు.
ఎన్నికల సిబ్బందికి పనికితగ్గ రెమ్యూనరేషన్ ఇవ్వాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



