- Advertisement -
– ఎన్నికల సిబ్బందికి జిల్లా విద్యాశాఖ అధికారి సూచన
నవతెలంగాణ – కామారెడ్డి
కలెక్టర్ ఆదేశాల మేరకు మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్లు వేగవంతంగా కొనసాగుతున్నాయనీ జిల్లా విద్యాశాఖ అధికారి రాజు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రిసైడింగ్ ఆఫీసర్లు, అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్లు, ఇతర పోలింగ్ ఆఫీసర్లకు కేటాయించిన సిబ్బంది రేపు ఉదయం 8 గంటలకు సంబంధిత డిస్ట్రిబ్యూషన్ సెంటర్‌కు హాజరై ఎన్నికలకు సంబంధించిన మెటీరియల్‌ను స్వీకరించాలని నోడల్ ఆఫీసర్ (ట్రైనింగ్ మేనేజ్మెంట్), జిల్లా విద్యాశాఖ అధికారి తెలిపారు. ఎన్నికల నిర్వహణ సజావుగా జరిగేందుకు అధికారులు ఇచ్చిన సూచనలను తప్పనిసరిగా పాటించాలని, నిర్ణీత సమయానికి హాజరుకావాలని సిబ్బందికి ఆ ప్రకటనలో సూచించారు.
- Advertisement -



