రెండేళ్ల పాటు నామినేట్ చేస్తారని చర్చ
నవతెలంగాణ – మల్హర్ రావు
ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు (పీఏసీఎస్) ప్రభుత్వం ఎన్నికలు నిర్వహిస్తుందా? లేదంటే పాలకవర్గాలను నామినేట్ చేస్తుందా ? అన్న చర్చ రాజకీయ వర్గాల్లో జోరందుకుంది. గత సంవత్సరం డిసెంబర్ 19న ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా డీసీసీబీ, పీఏసీఎస్ల పాలకవర్గా లను రద్దుచేసింది. ఎన్నికలు నిర్వహించే వరకు..లేదంటే ఆరు నెలల వరకు జిల్లా కలెక్టర్లు, సహకార శాఖ అధికారులు పర్సన్ ఇన్ఛార్జిలుగా వ్యవహరిస్తారని ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో త్వరలోనే సహకార సంఘాలు ఎన్నికలు జరుగుతాయని కొందరు భావిస్తున్నారు.లేదు ఎన్నికలు నిర్వ హించకపోవచ్చని మరికొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
వ్యవసాయ మార్కెట్ కమిటీల తరహాలోనే వీటికి రెండేళ్లపాటు పాలకవర్గాలను నామినేట్ చేయవచ్చనే చర్చ కూడా సాగుతోంది.ఒక్కో పీఏసీఎస్ చైర్మన్, వైస్ చైర్మన్ సహా 13 మంది ఉంటారు.ఈ లెక్కన జిల్లాలోని 10 పీఏసీఎస్లలో 130 మందికి రాజకీయ పదవులు దక్కనున్నాయి. ప్రక్రియ ఏదైనా సరే..పీఏసీఎస్ల పదవులకు నియామక ప్రక్రియ ఏదైనా తమకు అవకాశం కల్పించాలంటూ నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారు.మరోవైపు పీఏసీఎస్ పోటీచేయాలంటే సదరు వ్యక్తి రైతుగా సొసైటీలలో సభ్యుడై ఉండాలి.
స్వల్ప కాలంలోనే రూ.లక్షల అబివృద్ధి
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే తాడిచెర్ల పిఏసిఎస్ చైర్మన్ గా ఇప్ప మొoడయ్య 15..8.2024న చైర్మన్ గా బాధ్యతలు చేపట్టారు.16 నెలల కాలంలో రాష్ట్ర ఐటి,పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబు సహకారంతో సొసైటీ భవన ఆధునికరణ పున నిర్మాణ పనులు రూ.40 లక్షలతో పర్మిచర్,స్ట్రాంగ్ రూమ్,కంపండ్ వాల్,గోల్డ్ లోన్ పర్మిషన్, తదితర పనులు చేపట్టారు.రూ.12 లక్షలతో మెయిన్ రోడ్డు నుంచి కమన్, సొసైటీ వరకు సిసి రోడ్డు నిర్మాణం చేశారు.మూడు ధాన్యం కొనుగోలు సీజన్లలో సుమారుగా 3లక్షల క్వింటాళ్ల ధాన్యం సేకరించి రూ.కోటి వరకు సొసైటీ కమిషన్ రూపంలో ఆదాయాన్ని తీసుకొచ్చారు.అలాగే మూడు సీజన్లలో ఎరువులు విక్రయించి దాదాపు రూ.30 లక్షల ఆదాయాన్ని సొసైటీలో జమ చేశారు.సొసైటీ మరింతగా ఆదాయం పెంచడానికి పెట్రోల్ బంకు,ఎల్జీ గ్యాస్ గోదాం అనుమతుల కోసం ప్రపోజల్ పెట్టారు.ఇదే చైర్మన్ కు మరికొన్ని ఏళ్ళు ప్రభుత్వం అవకాశం ఇస్తే మంరింతగా అభివృద్ధి జరగవచ్చని సొసైటీలో ఉన్న సభ్యులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.



