Tuesday, March 10, 2026
E-PAPER
Homeజిల్లాలుప్రశాంతంగా ముగిసిన ఆరు మున్సిపాలిటీల ఎన్నికలు: కలెక్టర్

ప్రశాంతంగా ముగిసిన ఆరు మున్సిపాలిటీల ఎన్నికలు: కలెక్టర్

- Advertisement -

హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపిన ఎన్నికల అధికారి, కలెక్టర్
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 

2 రెండవ సాధారణ మున్సిపాలిటీ ఎన్నికలు విజయవంతంగా పూర్తి చేసిన సందర్భంగా ఎన్నికల అధికారులకు, సిబ్బందికి ఎన్నికల అధికారి, కలెక్టర్ హనుమంత రావు  హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఎన్నికల నిర్వహణలో మీరు చూపిన క్రమశిక్షణ, నిబద్ధత, అంకితభావం ప్రశంసనీయమన్నారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడుతూ.. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడంలో మీ సేవలు అమూల్యమైనవని తెలిపారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి బాధ్యతలను విజయవంతంగా నిర్వర్తించాలని ఆకాంక్షిస్తున్నామని అన్నారు. మీ అందరికీ మరోసారి అభినందనలు, శుభాకాంక్షలు అని అన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -