నవతెలంగాణ-హైదరాబాద్ : తెలంగాణలో స్థానిక సంస్థల సమరానికి ముహూర్తం ఖరారైంది. మేడారం సమ్మక్క-సారలమ్మ సాక్షిగా ఆదివారం (జనవరి 18, 2026) జరిగిన రాష్ట్ర మంత్రిమండలి సమావేశంలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు తెలంగాణ ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఈ మేరకు ఫిబ్రవరి నెలలో ఎన్నికలు జరపాలని నిర్ణయిస్తూ ఎన్నికల సంఘానికి ప్రభుత్వం లేఖ రాసింది.
ఈ నెల 21న షెడ్యూల్, ఫిబ్రవరి 14న పోలింగ్ నిర్వహించేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. మరో మూడు రోజుల్లోనే అధికారిక ఎన్నికల షెడ్యూల్ వెలువడే అవకాశం ఉండటంతో రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది.
అటు అభ్యర్థుల ఎంపిక, సీట్ల సర్దుబాటుపై పార్టీలు తీవ్రంగా కసరత్తు చేస్తున్నాయి. ఓటర్లను ఆకట్టుకునేందుకు నేతలు వ్యూహాలు పన్నుతున్నారు.



