Tuesday, October 7, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలి: సబ్ కలెక్టర్

ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలి: సబ్ కలెక్టర్

- Advertisement -

నవతెలంగాణ – ఆర్మూర్
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలని సబ్ కలెక్టర్ అభిజ్ఞాన్ మాల్వియా అన్నారు. డివిజన్ స్థాయిలో గ్రామపంచాయతీ ఎన్నికలకు సంబంధించి ప్రిసైడింగ్ అధికార్ల శిక్షణ కార్యక్రమం మంగళవారం నిర్వహించినారు. ఈ సందర్భంగా విసిట్ చేసి అధికార్లకు పలు సూచనలు చేశారు. ఎన్నికల విధులలో పాల్గొనే ప్రిసైడింగ్ అధికారులు క్షణ క్షణం అప్రమత్తతో ఉంటూ ఎలక్షన్ కమిషన్ సూచనలు పాటిస్తూ ఎన్నికలు సజావుగా నిర్వహించాలని అధికార్లకు సూచించారు. ఈకార్యక్రమం లో డి ఎల్ పి ఓ శివకృష్ణ , ఎంపీడీవో  శివాజీ ,ఆలూరు ఎంపీడీవో గంగాధర్ , ఎంపీ ఓ శ్రీనివాస్ ఎంఈఓ రాజగంగారం , ఆర్పీలు  సంగెం అశోక్,రాము,గంట అశోక్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -