ఈవీఎంలపై దేశ ప్రజల్లో అనేక అనుమానాలు ఉన్నాయి : బీఆర్‌ఎస్ నేత కేటీఆర్
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
ఈవీఎంలపై దేశ ప్రజల్లో అనేక అనుమానాలు ఉన్నా యని, వాటి పట్ల ప్రజలు విశ్వసనీయతను కోల్పోయారని బీఆర్ ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. త్వరలో జరగబోయే బీహార్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు తర్వాత వచ్చే సాధారణ ఎన్నికల్లోనూ పేపర్ బ్యాలెట్ విధానంలోనే ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేశామని కేటీఆర్ పేర్కొన్నారు. మంగళవారం కేంద్ర ఎన్నిక సంఘాన్ని బీఆర్‌ఎస్ బృందం కలిసింది. అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. ఈసీ ముందు ఆరేడు విషయాలు కుండబద్దలు కొట్టినట్టు మా పార్టీ అభిప్రాయం చెప్పామన్నారు. అందులో ఒకటి ప్రపంచవ్యాప్తంగా ఈ రోజు అమెరికా లాంటి దేశాలు, యూకే, జర్మనీ, ఇటలీ, ఇంకా చాలా దేశాలు కొంతకాలం వరకు ఈవీఎంలను ప్రయోగాత్మకంగా అమలు చేసినప్పటికీ, ప్రజల్లో వాటిపై విశ్వాసం లేకుండాపోవడంతో పేపర్ బ్యాలెట్ విధానాన్ని అమలు చేస్తున్నాయన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన ఇండియాలో దాదాపు 100 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. ఇలాంటి దేశంలో ఈవీఎంల వల్ల నష్టం జరుగుతుందని తెలిపారు. ఎవరికి ఓటు వేస్తే వారికి పడడం లేదని ప్రజల్లో అభిప్రాయం వ్యక్తమవుతోందన్నారు. అందువల్ల బ్యాలెట్‌లను తేవాలని పార్టీ తరపున కోరినట్టు వెల్లడించారు.
పేపర్ బ్యాలెట్ విధానంలోనే ఎన్నికలు నిర్వహించాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES