Sunday, February 22, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంనర్సింగ్‌ మండలికి ఎన్నికలు నిర్వహించాలి

నర్సింగ్‌ మండలికి ఎన్నికలు నిర్వహించాలి

- Advertisement -

తెలంగాణ ఫ్లోరెన్స్‌ నర్సింగ్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

తెలంగాణ రాష్ట్ర నర్సింగ్‌ మండలికి వెంటనే ఎన్నికలను నిర్వహించాలని తెలంగాణ ఫ్లోరెన్స్‌ నర్సింగ్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ డిమాండ్‌ చేసింది. ఈ మేరకు అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షులు నక్క సూర్య కుమార్‌ నేతత్వంలో నాయకులు అకడమిక్‌ వైద్య విద్య సంచాలకులు (డీఎంఈ)కు వినతి పత్రం సమర్పించారు. ఎన్నికలను ఆలస్యం చేయడం చట్టాన్ని ఉల్లంఘించడమేనని ఆయన గుర్తుచేశారు. చట్ట ప్రకారం ఐదుగురు సభ్యులను ఎన్నికల ద్వారా నియమించాలని సూచించారు. గెజిట్‌ ప్రకటన వెలువడినప్పటికీ ఇప్పటివరకు ఎన్నికల ప్రకటన జారీ కాలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌కు ఎన్నికలు నిర్వహిస్తామని హామీ ఇచ్చి అధికారులు చర్యలు తీసుకోలేదని తెలిపారు. ఎన్నికలు నిర్వహించకుంటే చట్టపరమైన పోరాటం చేస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అడవెల్లి సురేష్‌, రాంబాబు, అభిశక్తి, శ్రీకాంత్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -