Tuesday, December 9, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఎన్నికలు పగడ్బందీగా నిష్పక్ష పాతంగా నిర్వహించాలి

ఎన్నికలు పగడ్బందీగా నిష్పక్ష పాతంగా నిర్వహించాలి

- Advertisement -

నవతెలంగాణ – పెద్దవూర
ఎన్నికలు పగడ్బందిగా నిష్పక్ష పాతంగా నిర్వహించాలని మండల ప్రత్యేక అధికారి పీడి రాజ్ కుమార్ అన్నారు. మంగళవారం గ్రామపంచాయతీ ఎన్నికలు భాగంగా పెద్దవూర మండల కేంద్రం లోని రాఘవేంద్ర ఫంక్షన్ హాల్ నందు పెద్దవూర మండలానికి సంబంధించి ప్రిసైడింగ్ ఆఫీసర్ యొక్క రెండో శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. అనంతరం ఎంపీడీవో మరియు సహాయ ఎన్నికల అధికారి  ఉమాదేవి, ఎన్నికల సిబ్బంది నోడల్ ఆఫీసర్ తరి రాము, మాస్టర్ ట్రైనర్లు ఇరుమాది పాపిరెడ్డి,, మేదర్ దేవేందర్ ఎన్నికల ఇన్చార్జి సహాయకులు పంకజ్ రెడ్డి  స్టేజ్ టు అధికారులు  జూనియర్ అసిస్టెంట్ పంకజ్ రెడ్డి ఎన్నికలసామాగ్రి, తనిఖీ బ్యాలెట్ బాక్స్ ఫీలింగ్ అయ్యే విధానం, ఓటు వేసే క్రమంలో ఎదురయ్య వివిధ సందర్భాలను తెలియ జేశారు. చాలెంజ్ఓట్, టెండర్ ఓట్, అండర్ ఏజ్ ఓట్ బ్లైండ్ ఓటర్ల వివిధ రకాల ఫారాలు, పిఓ డైరీ,పిఓ డిక్లరేషన్ విసిట్ ఫామ్ పేపర్ సీల్, ఎకౌంట్ బ్యాలెట్ పేపర్ ఎకౌంట్  మరియు కౌటింగ్ గుకు సంబంధించిన విషయాలు తెలియజేసినారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -