జై భీమ్ బహుజన అణగారిన కులాల పొలిటికల్ జేఏసీ డిమాండ్
నవతెలంగాణ – వనపర్తి
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇచ్చాకే ఎన్నికలు నిర్వహించాలని జై భీమ్ బహుజన అణగారిన కులాల పొలిటికల్ జేఏసీ శుక్రవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేసిందని జై భీమ్ బహుజన ఆణగారినకులాల పొలిటికల్ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ కొమ్మురాములు మాదిగ డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర బందుకు వివిధ కుల, ప్రజా, విద్యార్థి సంఘాలు, మేధావులు, కళాకారులు మద్దతిచ్చి బందును జయప్రదం చేయాలని కొమ్మురాములు మాదిగ పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉందని, ఎన్ని అడ్డంకులు వచ్చినా స్థానిక సంస్థలకు ముఖ్యమంత్రి ముందుకు వెళ్తున్నారని వారన్నారు. అన్ని రాజకీయ పార్టీలు ఒకే తాటి పైకి వచ్చి కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం పై ఒత్తిడి తెచ్చి పార్లమెంట్లో బిల్లు పెట్టే వరకు పోరాటాలు చేయాలని అన్నారు.
రాజకీయ లబ్ధి కోసమే రెడ్లు, వెలమల దొరలంతా ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలను ఓటు బ్యాంకుగా వాడుకొని వారి నోటి కాడికి కూడును గుంజుకుని తినడానికి ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. దీన్ని బీసీ వర్గాలు మేధావులు ప్రతి ఒక్కరు ముక్తకంఠంతో ఖండించాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎన్ ఎస్ టిసి క్రైస్తవ సంఘం రాష్ట్ర చైర్మన్ కేపీ మార్టిన్ లూథర్, దళిత సామాజిక వర్గం నాయకులు కల్మూరు వెంకటేష్ మాదిగ, తెలంగాణ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎర్రం భగవంతు, రంజిత్ కుమార్, మాల మహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మూల దశరథం తదితరులు పిలుపునిచ్చారు.
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇచ్చాకే ఎన్నికలు నిర్వహించాలి
- Advertisement -
- Advertisement -