నవతెలంగాణ-రామారెడ్డి
గ్రామాల, మండలాల అభివృద్ధికి మాజీ ప్రజా ప్రతినిధులు నిర్వహించిన పనుల నిధులను వెంటనే విడుదల చేయాలని మండల ఎంపిటిసిల ఫోరం మాజీ అధ్యక్షులు గర్గుల రాజా గౌడ్ మంగళవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ఎస్ ఎఫ్ సి, సి డి ఎఫ్, ప్రత్యేక నిధుల కింద మాజీ ప్రజాప్రతినిధులు అభివృద్ధి కోసం, అప్పులు తెచ్చి పనులు నిర్వహించారని, ఇప్పటివరకు ప్రభుత్వం నిధులను చెల్లించకపోవడం బాధాకరమని అన్నారు. వెంటనే బకాయి నిధులను పూర్తిగా చెల్లించి, రాష్ట్ర ప్రభుత్వం స్థానిక ఎన్నికలకు పోవాలని డిమాండ్ చేశారు. ఎందరో మాజీ ప్రజా ప్రతినిధులు అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న ఘటనలు ఉన్న, నిమ్మకు నీరెత్తినట్లు ప్రభుత్వం వ్యవహరిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే నిధులు మంజూరు చేసి మాజీ ప్రజాప్రతినిధులను ఆర్థికంగా ఆదుకోవాలని కోరారు.
బిల్లులను చెల్లించిన తర్వాతే ఎన్నికలకు నిర్వహించాలి..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES