Saturday, July 26, 2025
E-PAPER
Homeసినిమాషెడ్యూల్‌ ప్రకారం ఎన్నికలు జరపాల్సిందే..

షెడ్యూల్‌ ప్రకారం ఎన్నికలు జరపాల్సిందే..

- Advertisement -

షెడ్యూల్‌ ప్రకారం తెలుగు ఫిలిం ఛాంబర్‌ ఎన్నికలు నిర్వహించాలని, లేకుంటే పోరాటం చేస్తామని నిర్మాతలు అల్టిమేటం ఇచ్చారు. శుక్రవారం హైదరాబాద్‌ తెలుగు ఫిలిం ఛాంబర్‌ కార్యాలయంలో తెలుగు ఫిల్మ్‌ ఛాంబర్‌ ప్రొడ్యూసర్స్‌ సెక్టార్‌ మాజీ అధ్యక్షుడు డా. ప్రతాని రామకష్ణ గౌడ్‌ ఆధ్వర్యంలో పలువురు నిర్మాతలు ప్రెస్‌మీట్‌ నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో నిర్మాతలు కె.ఎస్‌.రామారావు, అశోక్‌ కుమార్‌, బసిరెడ్డి, మోహన్‌ గౌడ్‌, విజయేందర్‌ రెడ్డి, వర్చువల్‌గా నిర్మాత సి.కల్యాణ్‌తోపాటు 150 మందికి పైగా నిర్మాతలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నిర్మాత కేఎస్‌ రామారావు మాట్లాడుతూ, ‘తెలుగు ఫిలింఛాంబర్‌కు 50 ఏళ్లకు పైగా చరిత్ర ఉంది. ఇలాంటి గొప్ప అసోసియేషన్‌ను క్రమశిక్షణ ప్రకారం కొనసాగేలా చేయాలని కోరుతున్నా. ఇప్పుడున్న అధ్యక్షులు భరత్‌ భూషణ్‌కి, ఇతర సభ్యులకు షెడ్యూల్‌ ప్రకారం ఎన్నికలు నిర్వహించాలని విజ్ఞప్తి చేస్తున్నా. ఈ అసోసియేషన్‌కు ఉన్న గౌరవాన్ని మనమంతా కాపాడుకుందాం’ అని అన్నారు.
‘నేను ఫిలింఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా కార్యక్రమం కోసం కోల్‌కతా వచ్చాను. అందుకే ఈ ప్రెస్‌మీట్‌కు రాలేకపోయా. తెలుగు ఫిలిం ఛాంబర్‌ ఎన్నికలను నిబంధనల ప్రకారం నిర్వహించాలి. ఈ అసోసియేషన్‌ను ఒక పద్ధతిలో ఇంతకాలం కొనసాగిస్తూ వచ్చాం. ఇప్పుడు కొందరు స్వార్థంతో తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ నెల 30న జరిగే ఈసీ మీటింగ్‌ తీసుకెళ్లి తిరుపతిలో పెడుతున్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వ పెద్దల దష్టికి తీసుకెళ్తాం. న్యాయపరంగా పోరాటం చేస్తాం’ అని నిర్మాత సి.కల్యాణ్‌ చెప్పారు.
నిర్మాత డా.ప్రతాని రామకష్ణ గౌడ్‌ మాట్లాడుతూ, ‘తెలుగు ఫిలింఛాంబర్‌లో అనేక పదవులు నిర్వహించాను. ఇండిస్టీలోని ప్రతి స్టార్‌ హీరోకు, ప్రొడ్యూసర్స్‌కు ఇందులో సభ్యత్వం ఉంది. ఈ ఛాంబర్‌కు ఎంతో చరిత్ర ఉంది. అలాంటి తెలుగు ఫిలింఛాంబర్‌లో నిరంకుశంగా మేమే కమిటీలో కొనసాగుతాం అనేది తప్పు. ఫిలింఛాంబర్‌ ఎన్నికల విషయంలో సీఎం రేవంత్‌ని కలవబోతున్నాం. అలాగే మన ఎంపీలతో పార్లమెంట్‌లోనూ ఈ విషయాన్ని లేవదీస్తాం’ అని తెలిపారు. ‘ఫిలింఛాంబర్‌ ఈసీ మీటింగ్‌లో అంబికా ప్రసాద్‌ అనే ఒక చిన్న డిస్ట్రిబ్యూటర్‌ చెప్పాడని ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు ప్రెజెంట్‌ బాడీలో ఉన్న నాయకులు చెప్పడం ఆశ్చర్యంగా ఉంది. ఛాంబర్‌ మనకు దేవాలయం లాంటిది. ఇక్కడే తప్పు జరిగితే రేపు ప్రభుత్వాల దగ్గరకు వెళ్లి ఎలా మన సమస్యలు చెప్పుకుంటాం. ఈ నెల 30వ తేదీతో ఇప్పుడున్న కమిటీ గడువు ముగుస్తుంది. వెంటనే షెడ్యూల్‌ ప్రకారం ఎన్నికలు జరపాలి’ అని నిర్మాత అశోక్‌ కుమార్‌ చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -